జనం న్యూస్ 26జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
ఈ కార్యక్రమాన్ని డీఆర్డిఏ కుమురం భీమ్ ఆసిఫాబాద్ మరియు ప్రజ్వలా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్. చిత్తరంజన్ , ఐపీఎస్, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఆసిఫాబాద్ హాజరై ప్రసంగించారు. మానవ అక్రమ రవాణా మరియు మహిళలు, పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.కార్యక్రమంలో జైనూర్ సీఐ ఈ. రమేష్ , జైనూర్ ఎస్ఐ జి. రవికుమార్ , సిర్పూర్ (యు) ఎస్ఐ డి. రామకృష్ణ , లింగాపూర్ ఎస్ఐ చి. గంగన్న , ఇతర పోలీస్ సిబ్బంది, టీజీఎస్పీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజ్వలా సంస్థ తరఫున జాయింట్ డైరెక్టర్ అహ్మద్ అలీ మరియు ఇతర సభ్యులు హాజరయ్యారు.డీఆర్డిఏ ఆసిఫాబాద్ నుండి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ , జైనూర్ మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), మండల అభివృద్ధి అధికారి (ఎంపీడిఓ) , ఇతర విభాగాల నుండి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి జైనూర్ మండల పరిధిలోని పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల నుండి 500 మంది విద్యార్థులు, 1000 మంది స్థానిక మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా నివారణ, బాధితుల పునరావాసం, నేరాల నివారణపై వివిధ అంశాలపై ప్రసంగాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ప్రసంగించిన అధికారులు మానవ అక్రమ రవాణా అనేది ఒక తీవ్రమైన నేరంగా పేర్కొంటూ, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు దీనికి గురవుతున్నారని వివరించారు. సామాజికంగా అందరూ కలసి ముందుకు వచ్చి ఇలాంటి ఘటనలను నివారించాల్సిన అవసరం ఉందని, ఏవైనా అనుమానాస్పద చలనలు గమనించినపుడు పోలీసులను వెంటనే సమాచారం అందించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమం స్థానిక ప్రజలలో చట్టాలపై, రక్షణ మార్గాలపై స్పష్టతను పెంపొందించిందని మరియు పోలీస్ శాఖ ప్రజలతో కలిసి మానవ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నదని తెలియజేశారు.పోలీసు శాఖ తరఫున, మేము ప్రజలలో మానవ అక్రమ రవాణా పై అవగాహన పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీస్ శాఖను సంప్రదించగలరని కోరడమైనది.E. రమేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్
జైనూర్ పోలీస్ సర్కిల్ , కుమురం భీమ్ ఆసిఫాబాద్.