జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కలెక్టర్ అంబేడ్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి, వారి సేవలను అభినందిస్తూ కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ మేరకు I&PR శాఖలో PRO గా సేవలందిస్తున్న మజ్జి వాసుదేవరావు ను కలెక్టర్ అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు.