ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 26 :
మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా హరితహారం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు,సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు.నాటిన మొక్కలకు నీళ్లు పోసి రక్షణ కవచాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు,సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్. నాగేశ్వరరావులు మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన అటవీ ప్రాంతం పెరగటం వాటి వల్ల విరివిగా వర్షాలు కురుస్తాయని,రోడ్ల కి ఇరువైపులా చెట్లు నాటకం ద్వారా నివాసాలు,పంట పొలాలపై దాడి చేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపటం జరుగుతుందని దానివలన వాటి నుండి రక్షణ పొందవచ్చునని అన్నారు.వాతావరణంలో ప్రాణవాయువును పెంచడం,పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం జరుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజున ఒక మొక్కను నాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ బి.రవి, ఉపాధ్యాయులు బి.శోభన్, కే.శ్యామల,బి.రవి, ఏ.సుస్మిత, యం.చందర్రావు, పి.శ్రీనివాస్,బి.సింగ్యా, వి.రమేష్,జె. నాగేశ్వరరావు, డి.వెంకటరమణ,ఉషశ్రీ, బి.చందర్, టి.హరియా నాయక్,సౌందర్య తదితరులు పాల్గొన్నారు.