జుక్కల్ జులై 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తాండ గిరిజనులు దాదాపు 30 40 సంవత్సరాల నుండి అసైన్డ్ పోడు భూమిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది.అప్పటినుండి ఈ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ వేరే ఇతర పనులు ఏమీ లేకుండా ఈ భూమినే జీవన ఆధారంగా గిరిజనులందరూ కలిసి భూముల్లోని రాళ్లు. రప్పలు,ముళ్ళ పొదలు. తొలగించుకుంటూ ఈ భూమిని వ్యవసాయానికి సాగుకు అనుకూలంగా చదును చేసుకుని పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వీరికి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ అసైన్డ్ పట్టాలు గత కెసిఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి రద్దుచేసి ప్రతి అసైన్డ్ పట్టేదారులకు భూమి హక్కు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకుండా గిరిజన భూములు ఫారెస్ట్ అధికారులతో దౌర్జన్యం చెయ్యడం,అప్పు చేసి పెట్టుబడి పెట్టి పంట సాగు చేసుకుంటున్న గిరిజనులపై దాడి చేసి పంటలను ట్రాక్టర్లతో, జెసిబి లతో గిరిజనులకు భయభ్రాంతులకు గురిచేసి పంటలను దౌర్జన్యంగా దున్ని వేసి గిరిజనుల భూములను ఆక్రమించడం సరైంది కాదని సిపిఎం. జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గోండ తీవ్రంగా మండిపడ్డారు.గిరిజనుల జోలికి గిరిజనుల పంటల జోలికి ఫారెస్ట్ అధికారులు వచ్చినచో నియోజక , జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని, అసైన్డ్ పోడు రైతులు మరి ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో గిరిజనులు, దళితులు,వెనుకబడిన, తరగతులవారు ఈ అసైన్డ్ పోడు భూములలో దాదాపు మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఉన్నప్పటినుండి ఈ భూమిని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. వీరిని ఇప్పుడు భూమి హక్కునుండి తొలగిస్తామంటే సాధ్యం కాని పని అని పోడు రైతులకు సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు గా ఉంటదని పోడు రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.