జనం న్యూస్,జూలై26,అచ్యుతాపురం:
కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సిఎస్ఆర్ నిధులతో వేస్ట్ మ్యానేజ్మెంట్ లో భాగంగా 40 రిక్షాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్,యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వర్ణాంధ్ర-స్వచాంద్ర కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం ఎంపిడిఓ కార్యాలయం వద్ద శనివారం చెత్త నిర్వహణకు 40 మూడు చక్రాల రిక్షాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నుంచి బజారు కోసం వెళ్ళేటప్పుడు ప్రతీ ఒక్కరూ తమ వెంట గుడ్డ సంచినీ తీసుకివెళ్లాలని కోరారు. అలా తీసుకుని వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ సంచులు వాడే అవసరం ఉండదన్నారు. మనం ప్రస్తుతం వాడేదంతా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నే గనుక వాటిని మరలా మరలా వాడితే క్యాన్సర్ కి గురవుతుండటం కూడా ఇప్పుడు మన కళ్ళముందే చూస్తున్నామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు అభినందనలు తెలిపారు.సిఎస్ఆర్ నిధులతో 40 రిక్షాలు సమకూర్చిన కోహెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వీలవుతుందన్నారు. కలెక్టర్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ప్లైన్ ఏరియాలలో ఈ 40 రిక్షాలు సరిపోయినప్పటికి, జగన్నాధపురం వంటి కొండవారు ప్రాంతాల్లో రిక్షాలు లాగడం ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆ ప్రాంతాలకు అవకాశం ఉన్నంతవరకు ఈవి ఆటోలు కానీ,ట్రాక్టర్ లు కానీ ఇప్పించాలని కోరామన్నారు.మోసయ్యపేట గ్రామస్తులు డ్రైనేజీ నిర్వహణ సమస్య వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని,వారి సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే ఆ గ్రామంలో కూడా పనులు ప్రారంభించామన్నారు. సిఎస్ఆర్ నిధులతో 40 రిక్షాలు సమకూర్చిన కోహెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.