జనం న్యూస్, 26 జూలై 2025, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం లోని, కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నదాన సత్రానికి , కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వాస్తవ్యులు, మారుతీ ఎన్ కోరే, వంట సామాగ్రిని విరాళంగా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రుద్రప్ప పాటిల్, మరియు మల్లయ్య స్వామి పాల్గొని, దాతను శాలువాతో సన్మానించి, ప్రసాదం అందజేశారు.