ఓటు హక్కును వినియోగించుకున్న. పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులు.
మాక్ ఎన్నికల్లో ఆరుగురు విద్యార్థులు పోటీ
147 ఓట్ల మెజార్టీతో విద్యార్థి నాయకుడిగా గెలుపొందిన
సుల్తాన్ అహ్మద్
అభినందించిన. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్.
పాఠశాల ప్రిన్సిపల్ నసీమా షేక్
జనం న్యూస్. జూలై 26. మెదక్ జిల్లా. నర్సాపూర్.
నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర(1) పాఠశాలలో పాఠశాల విద్యార్థి నాయకులు సహాయ నాయకులకు మాక్ పద్ధతిలో అట్టహాసంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. పాఠశాలలో ఈ మాక్ ఎన్నికలు నిజమైన ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా కొనసాగాయి.ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఎన్నికల సిబ్బంది పాత్రను నిర్వహించటం విశేషం. పాఠశాల విద్యార్థి నాయకుడి బరిలో ఆరుగురు విద్యార్థులు పోటీ పడగా.అందులో 10వ. తరగతి విద్యార్థి సుల్తాన్ అహ్మద్ 147 ఓట్లు మెజారిటీతో పాఠశాల విద్యార్థి నాయకుడిగా గెలుపొందాడు.మరో విద్యార్థి జ్ఞానేశ్వర్ 107 ఓట్లతో సహాయ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు. మెదక్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్.నర్సాపూర్ మైనారిటీ పాఠశాల1 ప్రిన్సిపల్ నసీమా షేక్ తో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ మాక్ ఎన్నికలను సోషల్ ఉపాధ్యాయురాలు కె.రజని అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాల వసతులతో పాటు అద్భుతమైన విద్యను మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా, పాఠశాల సిబ్బందిని అభినందించారు. ప్రజాస్వామ్య విలువలను నేర్పే విధంగా విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించేలా చేయాలని సూచించారు. ఈ మాక్ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు అభినందించారు.ఈ కార్యక్రమంలో.పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు.