గ్రామాభివృద్ధి కమిటీ అంటే స్వంచందా సంస్థ లాగా పనులు చెయ్యాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జనం న్యూస్ జూలై 26:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోని తాళ్ళరాంపూర్ సొసైటీఫంక్షన్ హాల్ లోజిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాపోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధికమిటీ అంటే అభివృద్ధి గురించి ఆలోచించాలి కానీ రాజకీయ లబ్ది కొరకు ఆలోచించకండిఅని అన్నారు. సిపిఎంల్ ప్రభాకర్ మాట్లాడారు వీడిసి సభ్యులను గ్రామానికి పంపేటపుడు సామజిక స్ఫూహ ఉన్న వారిని పంపండి. వీడిసి కొన్ని మంచి పనులు చేయడం వలన వీడిసి ఉన్నాయి. మంచి పనులు చెయ్యండి ఇప్పుడు వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కరోనా సమయం లోమన జిల్లాలో 300మంది చనిపోయారు. కానీ ఒక సంవత్సరములో 400మంది చనిపోతున్నారు కారణం హెల్మెట్ ధరించక, మితిమీరు ఆల్కహాల్ తీసుకోని డ్రైవింగ్ చేయడం వలన చనిపోతున్నారు. రోడ్ల పై కేజీవిల్ నడుపడం వలన రోడ్లు చెడిపోతున్నాయి. వీటి పైన చర్యలు తీసుకోవాలి అని అన్నారు.డాక్టర్ సి నారాయణ రెడ్డి " దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అన్నారు. ఒకరినొకరిపై ఈర్ష్య ద్వేషం ఉండకూడదు అందరు సామానులే. ఏ గ్రామంలో నైనా గ్రామాభివృద్ధి కమిటీ వారు చట్టాన్ని మీ చేతులో తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఆ గ్రామములో ఎవరైనా పాసుపోర్టు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు అప్లై చేస్తే నేను నెగటివ్ రిపోర్ట్ ఇస్తే ఎవరికీ పాసుపోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ రాదు దీనిని దృష్టిలో పెట్టుకొండి అన్నారు. తరువాత జిల్లా ప్రధాన న్యాయమూర్తిజి వి ఎన్ భారతి లక్ష్మి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ అంటే చట్టాలకు లోబడి పనులు చెయ్యాలి తప్ప చట్టానికి వ్యతిరేకంగా అంటే కులబహిష్కరణ, పెద్ద మొత్తంలో జరిమానాలు తీయరాదు ఆర్మూర్ డివిజన్ లో వీడిసి ల అరాచకాలు ఉన్నాయి పద్ధతి మార్చుకోవాలి అని అన్నారు. రాజ్యాంగం ఏమని చెప్పింది అంటే వివక్ష, లింగ భేదం చూపరాదు కానీ చట్టాన్ని మీ పరిధిలో తీసుకుంటే కురుక్షేత్రం లో శ్రీ కృష్ణుడు విశ్వరూపం చూపినప్పుడే అర్జునుడు అన్ని మర్చిపోయి యుద్ధం చేశాడు. అదేవిధంగా మన సీపీ లాలించగలడు, పాలించగలడు, శిక్షించగలడు అవరమైతే 60అడుగుల విశ్వరూపం చూపిస్తాడు అని మాట్లాడారు. చట్టాలు ఎవ్వరికి బంధువులు కారు ఎంతటివరికైనా శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. ఇక్కడికి రావటానికి కారణం గ్రామాభివృద్ధి కమిటీ అరాచకాలు రాష్ట్ర హై కోర్ట్ వరకు పోయింది వారి ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. చట్టం లోపల మంచి పనులు చెయ్యండి. గ్రామ కమిటీ అంటే స్వచ్చందా సంస్థ లాగా పని చెయ్యండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ఉదయ్ భాస్కర్, అడిషనల్ సివిల్ జడ్జి సరళ రాణి, సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీదేవి ఆర్మూర్, ఏ సి పి వెంకటేశ్వర్ రెడ్డి, బార్ కౌన్సిల్ రాజేందర్ రెడ్డి, బార్ ప్రెసిడెంట్ సాయరెడ్డి నిజామాబాద్, బార్ ప్రెసిడెంట్ శ్రీధర్ ఆర్మూర్, పాల్గొన్నారు.