జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఇద్దరికే పేరు ఉంది. ఒకరు అశోక్ గజపతిరాజు..మరొకరు పెనుమత్స సాంబశివరాజు.. పార్టీలు వేరైనా ఇద్దరూ ఇద్దరే. సుదీర్ష కాలం రాజకీయ ప్రస్థానం కొనసాగించి వరుస జయాలు చవిచూసినా కొంచెం కూడా గర్వం ఉండేది కాదని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు.
ఇప్పటికీ జిల్లా ప్రజలు 'మా రాజులే' అని గొప్పగా చెప్పుకుంటుంటారు. దశాబ్దాల కాలం రాజకీయాలు చేసినా పెద్దగా శత్రువులు లేకపోవడం వాళ్ల గొప్పతనమే.