జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గెలిచిన 100 రోజుల్లో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే నేడు ఎంతమందికి ఇచ్చారో సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రశ్నించారు.
భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు కోసం యువతకు మాయమాటలు చెప్పడం సరికాదన్నారు. 400 రోజులు దాటినా పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవన్నారు.