జనం న్యూస్ జూలై 27 కూకట్పల్లి ప్రజల శ్రీనివాసరెడ్డి
అన్ని వర్గాలపేదల, దళితుల హక్కులకై నిరంతరం అలుపెరుగనిపోరాటం చేసి ఎస్సి వర్గీకరణ సాధించి పద్మశ్రీ పురస్కారానికి అర్హుడై రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు అందుకున్న మంద క్రిష్ణ మాదిగ ను ఎం ఆర్ పి ఎస్ మాజీ యూత్ లీడర్ బుల్లెట్ రవి, అర్జున్, సీనియర్ బీసీ నాయకుడు తేల్ల హరికృష్ణ తో కలిసి లు ఘనంగా సన్మానించారు.శనివారం బిజెపి సీనియర్ నాయకుడు మాధవరం కాంతారావు బోయన్ పల్లి మల్లారెడ్డి గార్డెన్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంద క్రిష్ణ మాదిగను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పిఅంబేద్కర్ విగ్రహం బహుకరించారు. కార్యక్రమం లో నజీర్, రహమాన్, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.