జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం
కాట్రేనికోన ఫ్రెండ్లీ క్లబ్ అధ్యక్షుడు గ్రంథి సూర్య నారాయణ గుప్తా (నానాజీ)కి డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారిగా ఎన్నుకున్న సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ వేద ఆశీర్వచనం చేయగా ఘనంగా దుశ్శాలువాతో నానాజీని సన్మానించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు పలువురు నానాజీని అభినందించారు. ఆయన నాయకత్వంలో బిజెపి కార్యకలాపాలు మరింత బలోపేతం కావాలన్న ఆశ భావాన్ని వ్యక్తం చేశారు