జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన జూలై 27 :
అమలాపురానికి చెందిన తూనికలు కొలతల శాఖ ఇంచార్జి ఇన్స్పెక్టర్ వి ఎస్ వి ఎస్ మోహన్ ఆధ్వర్యంలో శనివారం కాట్రేనికోన సంత నందు నిర్వహిస్తున్న దుకాణాలను తనిఖీ చేశారు. తూనికలు కొలతల శాఖల ప్రకారం నిబంధనలు సక్రమంగా పాటించని పలు దుకాణాల కటాలు పరిశీలన చేశారు. ఒక దుకాణం ఉపయోగించే కాటా సక్రమంగా లేకపోవడం తో కేసు నమోదు చేశామని మోహన్ కుమార్ తెలియజేశారు. 15 మంది వ్యాపారుల కాటా లకు నిబంధనలు మేరకు ముద్ర (సీలు ) వేశామని అయన తెలిపారు వ్యాపారులు వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒక సంవత్సరం, రాళ్లు ఉపయోగించే ఆర్డినరీ కాటా లకు రెండు సంవత్సరాలు గడువు తీరి న తరువాత సీల్ వెయ్యించుకోవాలని, ఈ విధంగా నిబంధనలను పాటించకుండా తప్పుడు తూ కాలు నిర్వహిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తే కేసుల నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు