గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ఆలస్యంగా విడుల చేశారు. ఉపాధి నిధుల దుర్వినియోగంపై కదిలిన డొంక చినకొత్తపల్లిలో ఉపాధి నిధులతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన సీసీ రోడ్డు చినకొత్తపల్లిలో నిర్మించిన సీసీ రోడ్లు చెక్ రూపేణ చెల్లించాల్సిన రూ.15.74లక్షలు నేరుగా డ్రా చేసిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లు జిల్లా అధికారులకు చేరిన డీఎల్పీవో విచారణ నివేదిక కార్యదర్శి, సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, అద్దంకి, జనవరి 27 (జనం న్యూస్) : గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ఆలస్యంగా విడుల చేశారు. తీరా నిధులు విడుదలైన తరువాత కూడా అద్దంకి మండలంలోని చినకొత్తపల్లిలో మాత్రం టీడీపీ నాయకుడు చేసిన పనులకు సంబంధించిన పనులకు విడుదలైన నిధులను సదరు నేతకు చెల్లించకుండా ఏకంగా వైసీపీ వర్గానికి చెందిన సర్పంచ్ గుజ్జుల మల్లికరెడ్డి, అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి కలిసి సర్పంచ్ సోదరుడు, వైసీపీ నేత చంద్రగిరి వీరారెడ్డి పనులు చేసినట్లు ఫోర్జరీ పత్రాలను సృష్టించి బిల్లులు చెల్లింపులు చేసిన సంఘటన పై అధికారుల విచారణతో అవినీతి డొంక కదిలింది. అద్దంకి మండలం చినకొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చినకొత్తపల్లి, శ్రీనివాసనగర్‌లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం జరిగింది. ఈ పనులకు సంబంధించి టీడీపీ నేత మానం మురళీమోహన్ దాసు 30 శాతం మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.15,74,283 విలువైన సామగ్రి సరఫరా చేశారు. అందుకు సంబంధించి 2021 సెప్టెంబరు 3వ తేదీ రూ.15,74,283 ప్రభుత్వం నుంచి విడుదల అయ్యాయి. ఈ నిధులను టీడీపీ నేత మానం మురళీమోహన్‌దా్‌సకు చెల్లించకుండా అప్పటి పంచాయతీ కార్యదర్శి (ప్రస్తుతం సంతమాగులూరు మండలం పాతమాగులూరు పంచాయతీ కార్యదర్శి) ఈశ్వరరెడ్డి, సర్పంచ్ మల్లికరెడ్డి నేరుగా డ్రా చేశారు. ఈ నగదును సర్పంచ్ సోదరుడు చంద్రగిరి వీరారెడ్డి కి చెల్లించారని మానం మురళీమోహన్‌దా్‌స ఒక వైపు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తునే మరో వైపు న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరో సారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చీరాల డీఎల్పీవో డిసెంబరు 18వ తేదీ శివనారాయణ విచారణ చేపట్టారు. విచారణలో సర్పంచ్ గుజ్జుల మల్లికరెడ్డి, అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి బ్యాంక్ నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడడంతో విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందున శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోరాదో నోటీస్ అందిన 10 రోజులలో సమాధానం ఇవ్వాలని జి ల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.