జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి
ఏలూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమావేశంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ఐజేయు నాయకులు సోమ సుందరం, ఆంధ్ర జ్యోతి బ్యూరో ఇంచార్జ్ రాజు తదితరులు రాష్ట్ర నాయకులు మండేల ప్రసాద్ (బాబి) ను సన్మానించారు.యు ట్యూబ్ ల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ లకు అక్రెడేషన్ ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుంచాలని నిర్ణయం…ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్ట్ లకు శిక్షణ తరగతులు నిర్వహించాలి…జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నందున మరింత వత్తిడి పెంచాలని సమావేశం నిర్ణయం…