తమ గ్రామానికి బస్సు రావటంతో హర్షం వ్యక్తం చేసిన గ్రామం ప్రజలు.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్) జనవరి 27 (జనం న్యూస్):- బేస్తవారిపేట మండలం, జేసి అగ్రహారం గ్రామ ప్రజలు తమ గ్రామానికి బస్సు సర్వీసు లేకపోవటంతో పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రయాణ ఇబ్బందులను ఎదుర్కొనుచున్నారు.. తమ సమస్యను గ్రామ నాయకుల ద్వారా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి కి తెలియ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సంబంధిత ఆర్టీసీ డిఎం కి ఫోన్ చేసి కోనపల్లె, గలీజేరుగుళ్ళ పిట్టకాయగుళ్ళ మీదుగా బేస్తవారిపేట, కంభం చేరుకునే బస్సు సర్వీసును పిట్టకాయగుళ్ళ నుండి వంగపాడు, జేసీ అగ్రహారం ఆర్. కొత్తపల్లె గ్రామాల మీదుగా బేస్తవారిపేట, కంభం చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..వారి ఆదేశాల మేరకు "కోనపల్లె నుండి గలిజేరుగుళ్ళ, పిట్టకాయగుళ్ళ వంగపాడు, జేసీ అగ్రహారం గ్రామాల మీదుగా కంభం చేరుకునే విధంగా బస్సు సర్వీసును నడుపుచున్నారు. తమ సమస్యను తెలియజేసిన వెంటనే తమ గ్రామానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి గ్రామ ప్రజలు నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.