జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొప్పుల (గొల్లపల్లి) గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యులు వైనాల రాజేందర్ సోమవారం ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ జెడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి , మండల విద్యాధికారి గడ్డం బిక్షపతి పాల్గొని విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు.అనంతరం వంగాల నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా మూసి ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలకు పునర్జీవం వచ్చింది. ప్రభుత్వ పాఠశాలను పునర్ ప్రారంభించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో 15 మంది విద్యార్థులను చేర్పించిన ఎం ఎస్ పి మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ ని అభినందించారు.పాఠశాలను పునర్ ప్రారంభించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎంఈఓ గడ్డం బిక్షపతి ని ఇక్కడ విద్యార్థులకు బోధనా అందించడంలో తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు ప్రధానోపాధ్యాయులు అశోక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నాం విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అన్ని మౌలిక వసతులు ఉంటాయన్నారు విద్యార్థులు తమ భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు ,బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు, షూస్ విద్యార్థుల నిత్యవసర వస్తువులను ఉచితంగ అందజేసిన వైనాల రాజేందర్ ని ఘనంగా శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమాలతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట కుమారస్వామి, విద్య కమిటీ చైర్మన్ మామిడి ప్రియా, మాజీ వార్డ్ నెంబర్ తోకల సమ్మిరెడ్డి, కుమ్మరి రాజయ్య, కుమ్మరి జగన్, సాయిరాం, గుండారపు రవీందర్, విద్యార్థుల తల్లిదండ్రులు అంగన్వాడి ఉపాధ్యాయులు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.