జనం న్యూస్ 28 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం)
గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలి
బీఎస్పీకి ప్రజలు అధికారం ఇవ్వడం ద్వారానే గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరింపబడతాయి
కొండా చరణ్ బీఎస్పీ చర్ల మండల అధ్యక్షులు
చర్ల మండలంలోని లింగాపురం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ లింగాపురం సెక్టార్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండాచరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడంలో గతంలో రెండు సార్లు ప్రభుత్వం వెలగబెట్టిన బిఆర్ఎస్ ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ విఫలమయ్యాయని స్థానికంగా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సిగ్గులేదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సోయలేదని విమర్శించారు 10 సంవత్సరాలు పరిపాలన వెలగబెట్టినప్పుడు బిఆర్ఎస్ పరిష్కరించలేని సమస్యలను అదే బిఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ నీ ఆ సమస్యలు పరిష్కరించమని కోరడం సిగ్గులేని తనమని మండిపడ్డారు ఎన్నేళ్లు పరిపాలించిన ప్రజా సమస్యల పరిష్కరించలేనటువంటి సోయలేని తనంలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నదని ధ్వజమెత్తారూ. ఈ రెండు పార్టీలకు ప్రజలు అధికారం ఇవ్వడం అనేది ఈ ప్రాంతానికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు వరద బాధితులకు ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇస్తానని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని అది ఇప్పటివరకు నెరవేర్చలేదని అన్నారు కరకట్ట ప్రతిపాదన పెట్టి కోరేగడ్డ భూములను ముంచే దిశగా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిందని అన్నారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కరకట్ట నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదాం వీరయ్య నాడు కరకట్టని కట్టనీయకుండా నిలిపివేశాడని దాని కారణంగా వరద తీవ్రతమై ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు వరదలు వచ్చి ప్రతి సంవత్సరం ప్రజలు హరివాస పడుతున్న ఇప్పటివరకు ఈత వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించలేదని అన్నారు చిత్తశుద్ధి లేనటువంటి ఈ పార్టీలను రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని గోదావరి పరివాహక ప్రాంత సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంగా పనిచేస్తున్న బీఎస్పీ పార్టీకి ప్రజలు అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి సామల ప్రవీణ్ పార్టీ మండల కోశాధికారి చెన్న0 మోహన్ పార్టీ ఈసీ మెంబర్ పార్టీ లింగాపురం సెక్టర్ అధ్యక్షులు కొండ కౌశిక్ లింగాపురం సెక్టర్ ప్రధాన కార్యదర్శి పంబి కుమారి లింగాపురం సెక్టార్ కార్యదర్శి పరవ లక్ష్మణ్ లింగాపురం సెక్టర్ కార్యదర్శి లక్ష్మి, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు