జనం న్యూస్ జూలై 28 జగిత్యాల
జిల్లా బీర్ పూర్ మండల లోని నరసింహుల పల్లె గ్రామానికి చెందిన హ్యూమర కౌసర్ కిడ్ని సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా గ్రామ మాజీ సర్పంచ్ ప్రభాకర్ కౌసర్ ఆరోగ్య పరిస్థితి ని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్ లో చికిత్స నిమిత్తం 2 లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సీ ని కౌసర్ కుటుంబ సభ్యులకు ఈరోజు హైదరాబాద్ లో అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులతో మాట్లాడి కౌసర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే.2 లక్షల 50 వేల LOC రావడానికి కృషి చేసిన ఎమ్మేల్యే గారికి కౌసర్ కుటుంబసభ్యులు,గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.