జిల్లాలో నీరు-చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది. పెండింగ్ బిల్లులకు మోక్షం లభించనుంది. అందుకు వీలుగా తక్షణం బిల్లుల వివరాలను అప్లోడ్ చేయా లని ప్రభుత్వం ఆదేశించడంతో జలవనరులశాఖ అధికారులు తదనుగుణమైన చర్యలు చేపట్టారు.
నీరు-చెట్టు పెండింగ్ బిల్లులకు మోక్షం
ప్రభుత్వ ఆదేశాలతో అప్లోడ్ చేస్తున్న ఇరిగేషన్ అధికారులు
రూ.28.75కోట్లకుపైన ఉన్నట్లు సమాచారం
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఒంగోలు, జనవరి 27 (జనం న్యూస్): జిల్లాలో నీరు-చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది. పెండింగ్ బిల్లులకు మోక్షం లభించనుంది. అందుకు వీలుగా తక్షణం బిల్లుల వివరాలను అప్లోడ్ చేయా లని ప్రభుత్వం ఆదేశించడంతో జలవనరులశాఖ అధికారులు తదనుగుణమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇంకా రూ.23.75కో ట్లకుపైగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించి వర్క్‌ల వారీగా అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నీరు-చెట్టు పేరుతో సాగునీటి వనరుల అభివృద్ధి చేపట్టారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, సాగర్‌తోపాటు ఇతర ప్రాజెక్టుల కాలువలు ఇలా అన్ని రకాల నీటి వనరులలో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్, షట్టర్లు, డ్రాప్‌ల పునరుద్ధరణ, మట్టికట్టల పటిష్టతతోపాటు ఇతరత్రా పనులు చేశారు. వర్షపు నీటిని వీలున్నంత మేర నిల్వ చేయాలన్నది ఈ పనుల లక్ష్యం. టీడీపీ కాలంలో ఉమ్మడి జిల్లాలో రూ.400 కోట్ల విలువైన పనులు చేపట్టి 90శాతం పనులు పూర్తి చేశారు. అప్పట్లోనే చేసిన పనులకు సంబంధించి రూ.75శాతం వరకు బిల్లులు చెల్లింపు కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వం రాగానే నిలిపివేత 2019లో వైసీపీ అధికారంలోకి రాగా నీరు-చెట్టు పెండింగ్ బిల్లులు అన్నింటినీ ఆపేసింది. దాదాపు రూ.80 కోట్ల వరకు అలా ఆఅగినట్లు సమాచారం. దాదాపు రెండేళ్లపాటు ఆ బిల్లులు ఇవ్వాలని, పనులు చేసిన వారు కూడా నాటి ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే పరిస్థితి లేకపోయింది. అనంతరం కొంత ఒత్తిడి పెంచారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో బిల్లులు ఇవ్వకపోగా తమపై కోర్టును ఆశ్రయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఒకవైపు కోర్టుకు యంత్రాంగం ద్వారా సమాధానం ఇస్తూనే మరోవైపు విజిలెన్స్ అలాగే ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో తనిఖీలు చేయిస్తూ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేసింది. తప్పని పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలతో ఇవ్వాల్సి వచ్చి కొంతమేర ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి చెల్లింపు చేసింది. అలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి ఇంకా రూ.40కోట్ల వరకు పెండింగ్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక కోర్టు కేసుల తీర్పు ఇతర రూపాలలో సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి ఉన్న సుమారు రూ.12కోట్ల మేర బిల్లులను రెండు నెలల క్రితం క్లియర్ చేశారు. ఇరిగేషన్ డివిజన్ల వారీ అప్లోడ్ఇంకా చాలా జిల్లాల్లో పెండింగ్ ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు మార్చితో ఖర్చుచేయాల్సి ఉన్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులపై దృష్టి సారించింది. జిల్లాల వారీ, ఇరిగేషన్ డివిజన్ల వారీ బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారంరోజులుగా ఇరిగేషన్ అధికారులు ఆ ప్రక్రియలో ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో ఇంకా 799 పనులకు సంబంధించి రూ.28.75 కోట్లు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. అందులో ఇప్పటికే కోట్లు తీర్పులు వచ్చి ఇవ్వాల్సినవి 31 పనులకు రూ. 3.21 కోట్లు ఉండగా కోర్టుకు వెళ్లకుండా ఉన్న వారికి సంబంధించి 159 పనులకు రూ.11.57 కోట్లు ఉన్నాయి. అలాగే జీఎస్టీ బిల్లులు లేవంటూ గత ప్రభుత్వం కొర్రీలు వేసి ఆపేసినవి 610 పనులకు రూ.14.07 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వాటిని కూడా అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అన్నిరకాల పెండింగ్ బిల్లులను ఇరిగేషన్ అధికారులు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నారు. త్వరలో ఈ బిల్లులకు మోక్షం కలగనుంది.