జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం వ్యాస నారాయణ మెట్ట సమీపంలో గంజాయి అమ్ముతుండగా చిల్ల రవితేజ, మచ్చ తేజ, ప్రసాద్‌ను పట్టుకున్నట్లు చెప్పారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.