దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో సుమారు 15 మంది దివ్యాంగులకు ఎలక్ర్టికల్ ట్రై సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు.
దివ్యాంగులు మనోధైర్యంతో సాగాలి
దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (చీరాలటౌన్), జనవరి 27 (జనం న్యూస్) :- దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో సుమారు 15 మంది దివ్యాంగులకు ఎలక్ర్టికల్ ట్రై సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి సంక్షేమాలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు. వేటపాలెం మండల పరిధిలోని చల్లారెడ్డి పాలెం ఎంజేఆర్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయనతోపాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.