మాజీ సర్పంచ్, గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు రావిపాటి రామేశ్వరరెడ్డి.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 30 (జనం న్యూస్):
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనంతో కలవకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ, వారు ఎప్పటికీ విజయం సాధించలేరని మాజీ సర్పంచ్, గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు రావిపాటి రామేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరు వెళ్తున్న జగన్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి సంస్కృతి గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన విమర్శించారు. జనంతో జగన్‌కు ఉన్న అనుబంధాన్ని ఎవరూ ఛిన్నాభిన్నం చేయలేరని ఆయన స్పష్టం చేశారు.వైఎస్ జగన్ గత ఐదేళ్ల పాలనలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించారని రావిపాటి రామేశ్వరరెడ్డి గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా ప్రతిపక్ష నేతలకు స్వాతంత్ర్యం ఇచ్చిందని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.ఈ పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీస్తున్నాయని రావిపాటి రామేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ జనంతో మమేకమైన నాయకుడని, ఆయనను జనం నుంచి వేరు చేయడం అసాధ్యమని ఆయన నొక్కిచెప్పారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, దీనిపై ప్రజలే సమాధానం చెప్పాలని మాజీ సర్పంచ్, గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు రావిపాటి రామేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.