జనం న్యూస్ జూలై 30 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కందికుప్ప గ్రామ పంచాయతీ శివారు జమ్మి చెరువులో మంగళవారం మలేరియా దోమల నివారణ మందును వైద్య సిబ్బంది ప్రతి ఇంటిలోనూ పిచికారీ చేశారు.ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ నాగేంద్ర రావు మాట్లాడుతూ ఈ సీజన్లో మలేరియా దోమలు ప్రభల కుండా జాగ్రతలు పాటించాలన్నారు, పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి నీలిమా పర్యవేక్షణలో స్ప్రేయింగ్ పూర్తి చేశామన్నారు,ఇది రెండవ వారమని,మరో రెండు వారాల పాటు జరుగుతుందన్నారు దీని వల్ల ఇళ్లలో దాగి ఉన్న దోమలు చనిపోయి,
దోమల ద్వారా వచ్చే వ్యాధులు అరికట్టబడతాయన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది
ప్రసన్న,భాగ్యలక్ష్మీ,సుమిత్ర,నీరజ,వెంకట లక్ష్మి,సూర్య కాంతం,తదితరులున్నారు