జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
పదో తరగతి మరియు ఇంటర్ ఉత్తమ ఫలితాలలో సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సా హకాలు అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించరుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకులు అందజేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరికి యూనిఫామ్ నాణ్యమైన భోజనం మూలిక వసతులు తల్లికి వందనం కార్యక్రమాల పేరుతో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.చదివే సంస్కారం నేర్పిస్తుందని తెలుగు ఒకటే కాకుండా హిందీ ఆంగ్లం కూడా బాగా నేర్చుకొని తద్వారా మేధాసంపత్తిని పెంపొందించు కోవాలన్నారు. విద్యా సంస్కారం సంస్కృతిని తెలియజేస్తుందని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులలో మానసికంగా శారీరకంగా శక్తిని పెంపొందించు అందుకోసం ఉదయం రాగి జావా చిక్కిలు నాణ్యమైన ఆహార పదార్థములను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరు ఊహించిన విధంగా మేము కూడా మా వంతు సహాయం చేస్తామని వచ్చే ఏడాది మరింత ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు ఊహించని విధంగా ప్రోత్సాహకాలు అందిస్తానని మేడా విజయ శేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పాఠశాల తో పాటు బాలికల కళాశాలలో ఇంత గొప్ప ఉపాధ్యాయులు పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందని విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదివి పాఠశాల తో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ తాము అందించిన నగదు ప్రోత్సాహకులు కేవలం కొంతమేర చిన్న సహాయమే అని విద్యార్థులు ఇంకా బాగా చదివి తద్వారా ఉన్నత పదవులు పొందాలన్నారు చదువుతో సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది అన్నారు.ఆగస్టు15న నిర్వహించే క్రీడ సంస్కృత పోటీలకు సంబంధించి విద్యార్థులందరికీ బహుమతులు అందజేస్తామన్నారు. పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమకైనా తమ వంతు సహకారం అందిస్తామన్నారు అనంతరం పదో తరగతిలో అఖిల్, ప్రధమ ,ఆశిక్ ద్వితీయ ప్రియ ,తృతీయ స్థానంలో అలాగే ఇంటర్మీడియట్ ప్రధమ మోబినా ,ద్వితీయ అక్షయ, తృతీయ గాయత్రిలకు, 5000 3000 2000 చొప్పున నగదు ప్రోత్సాహంతో పాటు మెమొంటో లను అందజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగన్నపల్లి వెంకటరమణ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఇందులో భాగంగా తెదేపా నాయకులు ధనుంజయ నాయుడు పాఠశాలలకు మెమోంటోలను అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాలకు అన్ని విధంగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.బాలికల ఇంటర్ కళాశాలకు సంబంధించి ల్యాబ్ అందుబాటులో లేదని ప్రస్తుతం నందలూరు జూనియర్ కళాశాలకు వెళ్లాల్సిన వస్తుందని ఇందుకోసం మీ వంతు సహాయం చేయాలని హెడ్మాస్టర్ గంగన్నపల్లి వెంకటరమణ కోరగా అందుకు సానుకూలంగా మేడా విజయ శేఖర్ రెడ్డి మరియు జంబు సూర్య నారాయణ స్పందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు ధనుంజయ నాయుడు సిరిసిల్ల నాగేంద్ర,దండు నాగేశ్వరరావు,మట్టి బాబు మెహర్ ఖాన్, కానకుర్తి వెంకటయ్య తుమ్మాది శివకుమార్ నరసింహ వెంకటసుబ్బయ్య సుధాకర్ రెడ్డి లేభాక శ్రీను, ఇరువూరి మురళి తదితరులు పాల్గొన్నారు,