(జనం న్యూస్ 31 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ లో గురువారం రోజున స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం పర్యటించారు. రీజినల్ రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీ బృందం పరిశీలించారు పరిశీలన లో భాగంగా అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను, సెగ్రేగేషన్ షెడ్ లను పరిశీలించి, తదనంతరం గ్రామస్తులతో ముఖాముఖీ సంభాషించి తడి చెత్త పొడి చెత్త ల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ పర్యటన లో పంచాయతీ పి.వసుంధర , ఫీల్డ్ అసిస్టెంట్ కిష్టయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.