జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
మేనేజర్ సయ్యద్ జానీ భాష టెక్నికల్ ఎక్స్పర్ట్ శశిధర్ రెడ్డి మార్టూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నందు ICTC సెంటర్ ను సందర్శించటం జరిగింది. ICTC సెంటర్ను సందర్శించి రికార్డ్స్ వెరిఫై చేసి సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతినెలా ICTC సెంటర్ కి నిర్దేశించిన ICTC టెస్టింగ్స్ టార్గెట్ పూర్తి చేసుకోవాలని దానిలో జనరల్ మరియు గర్భిణీలు ప్రతినెల ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేసుకోవాలని అలాగే LFU miss లు సెంటర్ నందు తగ్గించుకోవాలని ఆసుపత్రి సిబ్బందితో సమన్వయం చేసుకొని హెచ్ఐవి పరీక్షలు పెంచుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ICTC సెంటర్ నందు Link ART సెంటర్ పనితీరు కూడా పర్యవేక్షించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మొదటి మంగళవారం ASHA మీటింగ్ నకు ICTC కౌన్సిలర్ పాల్గొనాలని ICTC సేవలు విస్తృతపరచాలని ICTC హెచ్ఐవి టెస్ట్ యొక్క ప్రాముఖ్యత తెలియపరచాలని చెప్పడం జరిగింది. మరియు ప్రతినెల నాలుగవ గురువారం జరిగే మీటింగ్ నందు హాస్పిటల్ సిబ్బందితో ICTC సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలియపరచాలని సూచించడం జరిగింది. తరువాత HELP - TI స్వచ్ఛంద సంస్థ యొక్క Drop in center ( DIC ) ను సందర్శించి పర్యవేక్షించడం జరిగింది. DIC సెంటర్ పనితీరును, ప్రాముఖ్యతను హైరిస్క్ గ్రూప్ వారికి తెలియపరచాలని, DIC మీటింగ్స్ కండక్ట్ చేయాలని HELP - TI ప్రోగ్రాం మేనేజర్ D. కోటేశ్వరరావు ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ Sd. జానీ భాష టెక్నికల్ ఎక్స్పర్ట్ శశిధర్ రెడ్డి మార్టూరు CHC మెడికల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి ICTC కౌన్సిలర్ శ్రీనివాసరావు ల్యాబ్ టెక్నీషియన్ వసంత HELP - TI ప్రాజెక్టు మేనేజర్ D. కోటేశ్వరరావు, ORW లు K.దుర్గ, M. సామ్రాజ్యం లు పాల్గొన్నారు.