జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం చెన్నై షాపింగ్ మాల్లో తొలగించిన కార్మికులు, ఉద్యోగులను కొనసాగించాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. బుధవారం షాపింగ్ మాల్ ముందు ఆందోళన చేశారు. షాపింగ్ మాల్‌ను నమ్ముకొని పని చేస్తున్న 100 మంది కార్మికులు, ఉద్యోగులను తొలగించడాన్ని ఖండించారు. అర్ధంతరంగా తొలగించడం వల్ల వారు బ్రతుకులు రోడ్డున పడతాయన్నారు. యథావిధిగా వారిని కొనసాగించాలని కోరారు.