జనంన్యూస్. 31.నిజామాబాదు. టౌన్.
బీసీల ఐక్యతను చాటుదాం… - మాదాసు స్వామి యాదవ్, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి "మదాసు స్వామి యాదవ్" మాట్లాడుతూ బిజెపి ఓబీసీ మోర్ఛ తెలంగాణ ఆధ్వర్యంలో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరి పై ఇందిరా పార్కు వద్ద ఆగస్టు 2వ తారీఖు నాడు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమనికు రాష్ట్రంలోని కుల సంఘాల, బిసి ఉద్యోగ సంఘాల, బీసీ విద్యార్థి సంఘాల, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు కామారెడ్డి డిక్లరేషన్ వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందాని ఆయన ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గొల్ల కురుములకు వాళ్ళ కులవృత్తులకు సంబంధించి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాను అని వాగ్దానం చేయడం జరిగిందని కానీ ఆ పథకం ఎక్కడ అమలు కావడం లేదని ఆయన వాపోయారు.. సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్లో సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ₹20,000 వేల కోట్లు బీసీలకు కేటాయిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు దాన్ని అమలు పరచలేదు రాష్ట్రంలో ఎంబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేయడం జరిగిందని వాగ్దానాలన్నిటిని అమలు పరచకుండా కాలయాపన చేస్తుందని, అనంతరామన్ కమీషన్ ప్రకారం కేవలం కుల వృత్తి, చేతి వృత్తి, సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ రంగాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ బీసీ వర్గీకరణ జరిగినప్పుడు అప్పుడు మతపరం మైనా వర్గీకరన జరగలేదు… మరి ఇపుడు బీసీ రిజర్వేషన్ లో ముస్లిం మైనారిటీ సోదరులకు మతపరమైన రిజర్వేషన్ బీసీ అని చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నదని ఆయన ఆరోపించారు… మా బీసీ సోదరులు అన్ని గమనిస్తున్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతరాని, అందుకే రేపు ఆగస్టు 2న ఇంద్రా పార్క్ వధ జరిగిన మహా బీసీ ధర్నాకు బీసీ యువకులు పెద్ద ఎతున తరాలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడలు వంచి బీసీ రిజర్వేషన్ కాపాడుకుంటమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో:- ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు మాస్టర్ శంకర్, బిజెపి అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ గిరి బాబు, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు సురేష్, ఓబీసీ ఐటీ సెల్ కన్వీనర్ రాజకుమార్, ఫాండు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు…