జనం న్యూస్ జనవరి 27-01-2024 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్:వినయ్ కుమార్ : ప్రతి ఏట రేగోడు మండలం మర్పల్లి గ్రామం నుండి చేసే దిండి పాదయాత్ర సోమవారం వేకువ జామున విఠలేశ్వర మందిరం నుండి ప్రారంభమైంది. గత 20 సంవత్సరాల నుండి పండరీపురం పండరి నాథుని దగ్గరికి గ్రామస్తులు పాదయాత్రగా వెళ్లడం ఆనవాహితీ. ప్రతి ఏటా పాదయాత్ర సద్గురు అంబదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో వెళ్లడం జరుగుతుంది అని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మాజీ సర్పంచ్ భూమిరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ రాములు, పులేందర్, కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.