జనం న్యూస్ జులై 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం శాయంపేట మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న కొప్పుల శ్రీధర్ రెడ్డి ఏటూరు నాగారం మండలానికి బదిలీపై వెళుతున్నందున గురువారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపిఎం శ్రీధర్ రెడ్డిని మండల సమాఖ్య పాలకవర్గం, గ్రామ సంఘాల సభ్యులు పుష్పగుచ్చ అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సురేఖ మండల సమాఖ్య అధ్యక్షురాలు గడిపే సుమలత మాట్లాడుతూ బదిలీ కావడం సహజమని బదిలీ అయిన వారు ఏ మండలంలో పనిచేసిన తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ఏపీఎం శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా శాయంపేట మండల కేంద్రంలో ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సురేఖ మండల సమాఖ్య కార్యదర్శి అమ్మ వసంత, కోశాధికారి దాసరి కల్పనాదేవి, సీసీలు గాజుల కేదార్, గుర్రం విజయ్ కుమార్, దొమ్మటి ప్రభాకర్, బోట్ల హేమలత, అకౌంటెంట్ గోలి అనిత, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాళ్ళు తదితరులు పాల్గొన్నారు…..