జనం న్యూస్ ఆగస్టు 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
మధు ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్న రోటరీ క్లబ్
యువ సభ్యుల ద్వారా చేపట్టనున్న మరిన్ని వినూత్న కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హిమాయత్ నగర్ శాఖ 17వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్లోని హోటల్ అమృత క్యాసెల్లో గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ డా. రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ కమిటీ బాధ్యతలు చేపట్టింది. మధు ప్రవీణ్ కుమార్ క్లబ్ అధ్యక్షుడిగా, రాహుల్ చౌహాన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీతో పాటు ఏడుగురు కొత్త సభ్యులు క్లబ్లో చేరారు. సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్న రోటరీ క్లబ్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, క్లబ్ నూతన అధ్యక్షుడు మధు ప్రవీణ్ కుమార్, ఆయన బృందం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ డా. రాంప్రసాద్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ అనేది కేవలం ఒక సంఘం మాత్రమే కాదు, అది సేవా మూర్తుల సమాహారం అన్నారు. కొత్త కమిటీ మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని నమ్మకం ఉందని అన్నారు. అసిస్టెంట్ గవర్నర్ విశ్వనాథ్ మాట్లాడుతూ…సమాజ మార్పులో ప్రతి సభ్యుడి పాత్ర కీలకం అన్నారు. యువ సభ్యుల ద్వారా మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టాలి అని పిలుపునిచ్చారు. క్లబ్ డైరెక్టర్ శ్యామ్ గత 17 సంవత్సరాలుగా సంఘానికి అందిస్తున్న అంకితభావ సేవలను సభ సభ్యులు ఈ సందర్భంగా ప్రశంసించారు. భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని డైరెక్టర్లు స్పష్టం చేశారు. హిమాయత్ నగర్ శాఖ సేవా మార్గంలో దృఢంగా ముందుకు సాగుతూ, భవిష్యత్లో మరిన్ని మానవతా కార్యక్రమాల ద్వారా సమాజసేవలో ఆదర్శంగా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో క్లబ్ గౌరవ సభ్యులు టి. ఆనంద్, రాకేష్ అల్జాపూర్, మెహర్, మనీష్, డా. స్రవంతి, విక్రమ్, సుధ, సుభశ్రీ, అనిల్ మాలో, మూర్తి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హిమాయత్ నగర్ శాఖ సేవా మార్గంలో దృఢంగా ముందుకు సాగుతూ, భవిష్యత్లో మరిన్ని మానవతా కార్యక్రమాల ద్వారా సమాజసేవలో ఆదర్శంగా నిలవనుంది.