జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రజలకు మేలుచేసే ప్రభుత్వం తెలుగుదేశం కూటమిపాలన అని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వితంతు పెన్షన్లను పెద్ద మొత్తంలో మంజూరు చేయడం జరిగింది అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామ పంచా యతీలో 14 మంది మహిళలకు పింఛన్లను అందజేయడం జరిగిం దన్నారు. కార్యాలయల చుట్టూ తిరక్కుండానే సంబంధిత మహిళలకు పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్య క్రమంలో సచివాలయ సిబ్బంది కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.