బిచ్కుంద, ఆగస్టు 01 జనం న్యూస్
తల్లిపాలు అమృతం లాంటిది అని హెల్త్ అసిస్టెంట్ సంగీత అన్నారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో ఎస్సీ వాడా అంగన్వాడి స్కూల్లో తల్లిపాల వారోత్సవాలు భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ సంగీత మాట్లాడుతూ, తల్లిపాల వారోత్సవాలు ఈరోజు నుండి ఈనెల 7 వరకు నిర్వహించబడుతుందని ఆమె అన్నారు. తల్లిపాలు తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి, ప్రసవమైన వెంటనే ముర్రుపాలు బిడ్డకు పట్టాలి అని ఆమె గర్భిణీ స్త్రీలకు సూచించారు. పుట్టిన వెంటనే ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి , ఇతర పదార్థాలు పుట్టిన బిడ్డకు తినిపించరాదని ఆమె పేర్కొన్నారు. తల్లులు బిడ్డలకు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలని ఆమె అన్నారు. వాళ్ల ముఖంలో ముఖం పెట్టి పాలిస్తే మన ప్రేమ అనేది పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది ఆమె అన్నారు. ఎక్కడో టీవీ చూసుకుంటూ పాలు త్రాగిస్తే, ఫోన్లు మాట్లాడుకుంటా పిల్లలకే పాలిస్తే వాళ్ళు సరిగా పాలు తాగలేరని ఆమె అన్నారు. అమ్మ పాలు బిడ్డలకు ఇస్తూ ఉంటే ఆప్యాయంగా పలకరించుకుంటూ బిడ్డకు పాలు పట్టాలని ఆమె అన్నారు.
అంగనవాడి టీచర్ గంగమ్మని మాట్లాడుతూ, తల్లిపాలు పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాల వరకు అమ్మ పాలు పడితే రొమ్ము క్యాన్సర్ రాదని ఆమె వివరించారు. తల్లి పాలు ఇవ్వడం మూలంగా మళ్ళీ గర్భం తల్లులు ధరించారని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ వర్కర్ కృష్ణవేణి, గర్భిణీ స్త్రీలు, కిషోర్ బాలికలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.