జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోనతెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ( బుచ్చిబాబు) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, దాట్ల పవన్ ,నడింపల్లి సుబ్బరాజు, త్సవటపల్లి పల్లి నాగు , త్సవటపల్లి శ్రీను జొన్నాడ రాజారావు, రంబాల రమేష్, రంబాల దొరబాబు బిజెపి గ్రంధి నానాజీ, మట్ట సూరిబాబు, రామలింగరాజు, పిఎస్ఎన్ రాజు, వాసంశెట్టి రాజేశ్వరరావు, విత్తనాల బుజ్జి , కంది కుప్ప సొసైటీ త్రి కమిటీ సభ్యులు కాలాడి వీరబాబు ,మోకా అప్పాజీ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.