జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి భూ భారతి దరఖాస్తులను పరిశీలించినారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి లో వచ్చిన దరఖాస్తులు అన్ని ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించినారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మారుతి, డిటి హేమలత, ఆర్ఐ రామ్ పటేల్ రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.