జనం న్యూస్ 02ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి.
ఆగస్టు 6న ధర్మపురి రానున్నపద్మ శ్రీ మంద కృష్ణా మాదిగ ధర్మపురి -
చొప్పదండినియోజకవర్గవృద్ధుల,వికలాంగుల మహా గర్జనసన్నాహక సదస్సు విజయవంతం చేయండి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ పగడపల్లి మండల అధ్యక్షులు మోదిపల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 6న ఆసరా పెన్షన్లు పెంపు కొరకు ధర్మపురి మరియు చొప్పదండి నియోజకవర్గ వృద్ధుల,వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా పద్మ మంద కృష్ణ మాదిగ వస్తున్న సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు దుమల గంగారాం మాదిగ ఎమ్మార్పీఎస్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు చిర్ర లక్ష్మణ్ హాజరై మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6000/-, ఇతర ఆసరా పెన్షన్లు 4000/-, తీవ్ర వైకల్యం గల వికలాంగులకు 15000/-లు వెంటనే ఇవ్వాలి. హామీ ఇచ్చిన తేది నుండి బకాయిలతో సహా చెల్లించాలి ఎఐసిసి ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు వెంటనే రాజకీయ రిజర్వేషన్ ప్రకటిస్తూ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆదేశాలు జారీ చేయాలి.ఎన్నికల హామి ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలో మరియు సంస్థలలో చట్ట ప్రకారం క్యాడర్ స్ట్రేంత్ ప్రకారం 4 శాతం ఉద్యోగాల బర్తి చేయాలి. వికలాంగుల రోస్టర్ సంఖ్యను 10లోపు సవరించాలి. ఎస్.ఆర్.డి జిఓ ను తక్షణమే ఇవ్వాలి. డ్రెస్ కోడ్ ఉద్యోగాలలో 4శాతం రిజర్వేషన్ కల్పించాలి, క్యారీ పార్వాడ్ చేసి ఉద్యోగాలను బర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు కాంతమ్మ ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు భువనగిరి కిషన్ ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిపెల్లి వనిత ఉపాధ్యక్షులు దికొండ మహేందర్ ప్రధాన కార్యదర్శి కొత్తూరు బాబు బాలే అంజన్న మండల అధ్యక్షులు గొల్లపెల్లి శ్రీధర్ బెదిగం రాజు ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు రాచర్ల భూమయ్య బొమ్మ దయాకర్ నాయకులు లింగన్న కుంటాల బాబు ఆరెల్లి నారాయణ ఆర్ ఎల్ స్వామి సంజీవ్ మల్లారపు సురేష్ డప్పు నరసయ్య కోలపురి పోచమ్మ బొమ్మెన లత తదితరులు పాల్గొన్నారు.