జనం న్యూస్ ఆగస్టు 1 నడిగూడెం
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీటి విడుదల చేయటంతో నడిగూడెం మండలంలోని ఎల్ 35 లిఫ్టు పరిధిలో పంటల సాగు నిమిత్తం శుక్రవారం లిఫ్ట్ చైర్మన్ మండవ అంతయ్య ఆయకట్టు రైతులతో కలిసి నీటిని విడుదల చేశారు.నీటి విడుదలతో నారాయణపురం, కరివిరాల, బృందావనపురం గ్రామాల్లోని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ సోషల్ మీడియ కోఆర్డినేటర్ నాగిరెడ్డి వెంకటరెడ్డి, లైన్ మెన్ ఎల్లయ్య, రైతులు వీరబాబు, మండవ వీరబాబు, రాంబాబు, మర్రి సతీష్ పాల్గొన్నారు.