జనం న్యూస్ జూలై 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము
అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 1నుండి 7వరకు నిర్వహించడం జరుగుతుంది. దాని భాగంగా తాళ్ళరాంపూర్ అంగన్వాడీ సెంటర్ లో శుక్రవారం రోజునా తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐ సి డి ఎస్ పర్యవేక్షురాలు సరస్వతి మాట్లాడుతూ అంతరాలు లేకుండా అందరికి తల్లి పాల మద్దతు అనే నినాదం తో ఈ వారోత్సవాలను అంగన్వాడీ కేంద్రంలో చదివే పిల్లల తల్లులు, కుటుంబసభ్యుల సమక్షంలో నిర్వహించారు. పుట్టిన గంటలోపు తల్లి పాలను అందించడంతో పాటు కొన్ని నెలలపాటు ఇవ్వడం తో పిల్లలకుఎలాంటి ఇన్ పెక్షన్లు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా తల్లి పాలు పిల్లలకు ఇవ్వడం వలన రొమ్ము కాన్సర్ బారీ నుండి తప్పించుకోవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమం లోసెంటర్ టీచర్ దోమకొండ అనురాధ ఏ ఎన్ ఎమ్ ఫిమేల్ శ్యామల, ఆశవర్కర్ రాజమణి, మమత, పిల్లలు తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.