జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు .వైసిపి పార్టీ అబద్దాల లకు పుట్టిన ఇండ్లు అని అన్నారు వైసిపి హయాంలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నామని ప్రతి ఇంట్లో చెబుతున్నారని తెలిపారు .వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిందని ఎక్కడ చూసినా అక్కడ బెల్ట్ షాపులు మద్యం ప్రియుల జీవితాలతో ఆడుకున్నారని నకిలీ మద్యం తాగి ఎంతోమంది మద్యం ప్రియుల భార్యలు తాళిబొట్టు తెంపేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు సీట్ విచారణలో మద్యం స్కామ్ లో ఇప్పటికే ఆరు మంది జైలుకు వెళ్లారని తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని దోషులను శిక్షింపబడుతారని తెలిపారు. గతంలో వైసిపి నాయకులు ప్రభుత్వానికి డిజిటల్ బిల్లులు చెల్లించకుండా కోట్లాది రూపాయలు నొక్కేసారని తెలిపారు మద్యం లో రంగులు వాడి నందు వల్ల ఎంతోమంది మద్యం ప్రియులు ప్రాణాలు పోగొట్టు కున్నారని తెలిపారు నిరంతరం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులు వెలుగుల వస్తున్నాయని అన్నారు . రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రెండు పరుగులు పెడుతు న్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో 90వ బూత్ కన్వీనర్ బూసెట్టి కిరణ్, బీసీ గురుకుల పాఠశాల చైర్మన్ వేణు, నాయకులు రమేష్, చంద్ర, దిలీప్ తదితరులు పాల్గొన్నారు