జనం న్యూస్ ఆగస్టు 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జిల్లాలో నూతనంగా గ్రామ పంచాయతీల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు ఒక ప్రకటనలో కోరారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేయబడిన గ్రామ పంచాయతీలు నేటికీ కొనసాగుతున్నాయని పెరుగుతున్న గ్రామీణ ప్రాంతాల జనాభా ఆధారంగా పెరుగుతున్న ఓటరుల సంఖ్య ఆధారంగా జిల్లాలో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలు బలహీన వర్గాల కోసం కేటాయిస్తున్న కాలనీలు ఆయా గ్రామాలకు శివారులలో ఉన్నందున వాటిని ఆయా గ్రామాలలో కలిపి నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయాలని, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అవకాశం ఉన్న గ్రామాల ను గుర్తించి ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దళిత బహుజన వర్గాలు నివసించే కాలనీలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గ్రామ అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషించే గ్రామపంచాయతీల పటిష్టతకు చర్యలు చేపట్టాలని కోరారు.//