జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన : దేవాదాయ శాఖ లో గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తూ. ఉత్తమ అధికారిగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసం పత్రం అందుకున్న శ్రీ వానపల్లి పల్లాలమ్మ దేవస్థానం కార్యనిర్వాన అధికారి బొక్క వెంకటేశ్వరరావు.. ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్. శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు. జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆర్డిఓ మాధవి. కలెక్టరేట్ ఏవో కాశి విశ్వేశ్వరరావు ఉన్నారు. ప్రశంసా పత్రం అందుకున్న వెంకటేశ్వరరావును దేవదాయ శాఖ ఉద్యోగులు. బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులు అభినందించారు