ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత,
జనం న్యూస్,ఆగస్ట్ 02,కంగ్టి సంగారెడ్డి జిల్లా
కంగ్టి మండల పరిధిలోని అంగన్వాడి సెంటర్ల పిల్లలతో,తడ్కల్ గ్రామ సచివాలయంలో శనివారం బాల మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ తమ చిన్నారులను గ్రామాల్లోని సమీప అంగన్వాడీ కేంద్రంలో తమ పిల్లలను పంపించాలన్నారు. చిన్నారులకు పౌస్టిక ఆహారంతో పాటు,ఆట పాటలు అక్షర అభ్యాసాలను, అంగన్వాడీ కేంద్రం ద్వారా నేర్పడం జరుగుతుందన్నారు. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, భాషా అభివృద్ధి, సుజనాత్మకత, సాంఘికత,అంగన్వాడి పిల్లలలో ఈ ఐదు విషయలు సద్రుడ పడతాయని అన్నారు.అనంతరం చిన్నారులతో ఆట పాటలను ఆడించి పాడించారు.మూడు సంవత్సరాల పిల్లలను మొదలుకొని ఐదు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడి కేంద్రాలలో అన్ని రకాలుగా తమ జీవనంలో ఉన్నత స్థాయికి ఎదిగి విధంగా ఆటపాటలతో పాటు, శారీరక దృఢత్వం, మానసిక పట్టుదలతో విద్యాభ్యాసాన్ని, అంగన్వాడి సెంటర్ల ద్వారా అంగన్వాడీ టీచర్లు పిల్లలకు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తడ్కల్ పరిసర గ్రామాల అంగన్వాడి టీచర్లు, ఆయాలు,ఆశ వర్కర్లు, చిన్నారుల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.