పట్టించుకోని అధికారులు
జనం న్యూస్ ఆగస్టు 02 సంగారెడ్డి జిల్లా
రామచంద్రాపురం లోని ప్రధాన రహదారిపై గల మారుతి సుజుకీ షోరూం ముందర గత రెండు నెలలుగా మంచినీటి పైపులైన్లు పగిలిపోయి నీరు వృధాగా పోతున్నా, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతోనీరు వృధాగా పోవడమే కాకుండా, రోడ్లు కూడా పాడవుతున్నాయని, ప్రజలకు నీటి ఎద్దడి ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా, మిషన్ భగీరథ నీటి సరఫరా పైపులైన్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయని, వాటి మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మంచినీరు వృధాగా పోతున్న ప్రాంతాలలో ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఈ విషయంలో అధికారులు మరింత చొరవ చూపాలని నీటి వృధా జరగకుండా, రోడ్లు పాడవకుండా, ప్రజలకు సరిపడా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.