అధ్యాపకులు అరుణ్ కుమార్ బెయ్యాల కు పిహెచ్.డి
జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అమలాపురం సమీపంలో చెయ్యేరు నందు గల శ్రీనివాస అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో సుదీర్ఘ కాలంగా సి.ఎస్.ఈ విభాగమునందు మరియు ఉపాధి శిక్షణ శాఖాధిపతిగా ,(ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్) సేవలందిస్తున్నటువంటి అరుణ్ కుమార్ బెయ్యాల కు, పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు సిద్ధాంత వ్యాసం "అల్ట్రాసౌండ్ చిత్రాల లో లోతైన నాడీ నెట్వర్క్ లో థైరాయిడ్ నాడ్యూల్ వర్గీకరణ" (థైరాయిడ్ నాడ్యూల్ క్లాసిఫికేషన్ విత్ డీప్ న్యూరల్ నెట్వర్క్ ఇన్ అల్ట్రా సౌండ్ ఇమేజెస్) అన్నామలై యూనివర్సిటీ అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఈయన తన సిద్ధాంత వ్యాసమును అన్నామలై యూనివర్సిటీ సి.ఎస్.ఈ విభాగమునకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.ప్రియా పర్యవేక్షణలో సమర్పించారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ&కరస్పాండెంట్ శ్రీ డి.వి.ఎన్.ఎస్.వర్మ ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి కి పరిశోధనాభిలాష లక్ష్యంగా సాగుతున్న విద్యా విధానంలో శ్రీనివాస అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల ధ్యేయమని, కళాశాలలో ఉపాధి శిక్షణ శాఖకు నిర్వహిస్తూ సి.ఎస్.ఈ విభాగములో పిహెచ్.డి పూర్తిచేసిన అరుణ్ కుమార్ బెయ్యాల అభినందనీయుడని, దుశ్శాలువా తో అభినందనలు తెలియజేశారు. ఈ అభినందన సభలో పాలకవర్గ సభ్యులు శ్రీ సందీప్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.సురేష్ బాబు, కళాశాల విద్యాశాఖాధిపతులు డాక్టర్ టి.రవికుమార్, డాక్టర్ వై.వెంకట్, సి.ఎస్.ఈ విభాగాధిపతి వి.సాయి ప్రియ, వివిధ విభాగాధిపతులైన భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ కె.ఎస్.రామకృష్ణ మరియు తదితర అధ్యాపకులు డాక్టర్ బి. అరుణ్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తన సిద్ధాంత వ్యాసాన్ని వివరిస్తూ థైరాయిడ్ నాడ్యులస్ అనేది థైరాయిడ్ గ్రంథి లో అసాధారణ పెరుగుదలని, వీటిని తగిన చికిత్స విధానం ద్వారా నివారణ చేయవచ్చని, వీటి నిర్ధారణ పరీక్షలు, చికిత్స ప్రణాళికలు తన సిద్ధాంత వ్యాసం ద్వారా తెలియజేశామని, తనకు విశేష తోడ్పాటు నందించిన కళాశాల యాజమాన్యము నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.