జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉత్తమ సిఐ అవార్డు లభించింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పి కృష్ణారావు చేతుల మీదుగా ఎం మోహన్ కుమార్ అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మోహన్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.