
జనం న్యూస్ నడిగూడెం ఆగస్టు02
నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ కోదాడ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని నల్లపాటి శ్రీనివాస్ రావు వ్యవసాయ క్షేత్రం లో నూతనగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం ను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కోదాడ డివిజన్ లో పంట చేతికి వచ్చిన తోటలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతం లోని రైతు లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందించే రాయుతిలను సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ తోటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని కోరారు.ఆయిల్ పామ్ పంటకు కూలీ ఖర్చులు తక్కువ అని ,కోతుల, దొంగల బెడదలేద ఉండదని అన్నారు. ఆయిల్ ఫామ్ పంటను ప్రభుత్వం నిర్ణయుంచిన ధరకు ప్రభుత్వం నియమించిన కంపెనీ వారే విక్రయస్తారని దళారుల ప్రమేయం ఉండదు అన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి క్షేత్ర సహాయకులు తొండల నరేష్, తదితరులు పాలుగోన్నారు.