
జనం న్యూస్ జులై 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా నిబద్ధతతో పని చేస్తే తప్పక ప్రజల మన్నలు పొందుతారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సురేఖ మండల సమైక్య ఏపిఎం శ్రీధర్ రెడ్డి బదిలీ కాగా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డికి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమేనని అన్నారు. శాయంపేట మండలంలో సుదీర్ఘంగా పనిచేసిన శ్రీధర్ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రవి, చింతల రవిపాల్, మారపల్లి రాజేందర్, మారపల్లి వరదరాజు, గజ్జి ఐలయ్య, లడే రాజ్ కుమార్, మారపల్లి కట్టయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు….