*వెరిఫికేషన్ చేసిన పెన్షన్లను మంజూరు చేయని పక్షంలో సదరమ్ క్యాంపు కార్యాలయాల ముందు - పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం డిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు?
జనం న్యూస్ ఎమ్మిగనూరు -: ఆదివారం 3:8:2025 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నందవరం జనం న్యూస్ P. రంగన్న డిఈఎఫ్ కార్యాలయం లో రాష్ట్ర "దివ్యాంగుల సాధికారత ఫోరం" (డిఈఎఫ్) అధ్యక్షులు బి సి నాగరాజు పత్రికా ముఖంగా మాట్లాడుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల వేల మందికి దివ్యాంగులకు పెన్షన్లను హోల్డ్ లో ఉంచి నిలిపివేయడానికి కారణం సంబంధిత సెర్ఫ్ (డిఆర్డిఎ)కార్యాలయ, ఎంపీడీవో కార్యాలయ, మున్సిపల్, సచివాలయాల అలాగే మెడికల్ బోర్డు కార్యాలయాల్లో అవగాహనారాహిత్య సిబ్బంది అని తెలియజేశారు, ఇక్కడ పై కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది దివ్యాంగులకు రీ-వెరిఫికేషన్ సంబంధించిన నోటీసుల జారీలలో అంటే శారీరక (అర్థో), మూగ, చెవుడు (హియరింగ్), గుడ్డి (విజువల్), మానసిక పిచ్చి (ఎమ్మార్) మొదలైనవి తప్పుగా పేర్కొనడం వల్ల నేడు ప్రభుత్వం కొన్ని వేలమంది దివ్యాంగుల సామాజిక పెన్షన్లను "హోల్డ్" లో ఉంచి నిలిపివేయడానికి కారణం అని పేర్కొన్నారు. ఇక్కడ నోటీసులు జారీ చేసే సచివాలయ సిబ్బంది వారు శారీరక వికలాంగులకు మూగ చూడు కింద మూగ చూడు వికలాంగులకు అందత్వం కింద అంధత్వ వికలాంగులకు మానసిక రుగ్మతల కింద ఇలా తప్పు తప్పుగా నోటీసులు జారీ చేసి వీరిని సంబంధిత మెడికల్ బోర్డు వాళ్ళు సరిగా చెక్ చేయలేకపోవడం వల్ల నేడు దివ్యాంగుల పెన్షన్ల నిలిపివేతకు కారణమైందని పేర్కొన్నారు. కావున ఇప్పటికైనా సెర్ఫ్ (డిఆర్డిఎ)కార్యాలయ, ఎంపీడీవో కార్యాలయ, మున్సిపల్, సచివాలయాల అలాగే మెడికల్ బోర్డు కార్యాలయాల్లో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి దివ్యాంగుల రీ-వెరిఫికేషన్ నోటీసులను సవరించి మెడికల్ బోర్డు వాళ్ళు చెక్ చేసి "హోల్డ్" లో ఉంచిన పెన్షన్లను వెంటనే మంజూరు చేసే విధంగ తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున అందోళన చేపడుతామని హెచ్చరించారు. త్వరలోనే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్లు నిలిపివేయబడిన దివ్యాంగులు మరియు డిఈఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.