జనం న్యూస్ ఆగస్టు 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం జిల్లా తెలుగు రైతు కార్యవర్గ సమావేశం అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీరామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో భాగంగా అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ పథకానికి రాష్ట్రాప్తంగా 46.86 లక్షల మందికి రైతులు ఖాతాలో 3174.43 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేసి నిధులు విడుదల చేశారని, అందులో అనకాపల్లి 161.45 కోట్లు రూపాయలు నిధులు విడుదల చేసి, 2,42,536 మంది రైతులకు 7000 లబ్ధి చేకూరిందని శ్రీరామమూర్తి తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మాట్లాడుతూ అన్నదాతకు డబుల్ సంక్షేమం రెట్టింపు సంతోషంగా రైతులందరూ ఉన్నారని, నాటి జగన్ రెడ్డి ఆ రైతులకు తీరని అన్యాయం చేశారని, రైతులు పసల భీమ వరుసగా మూడు సంవత్సరాలు చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నలిసిపోయారని, వరదలు, నాటి వైసిపి ప్రభుత్వం రైతులకు తీరని నష్టం కలిగించిన నట్టేట ముంచారని రమణమూర్తి ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పుడు కూటమీ ప్రభుత్వంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని రమణమూర్తి కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాడి ముసలి నాయుడు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి కాలింగ సన్యాసినాయుడు చోడవరం నియోజవర్గ తెలుగు రైతు అధ్యక్షులు తెలుగు రైతు నాయకులు మల్ల వరాహ నరసింహారావు కే సాంబశివరావు మల్ల శేషు దాడి బాలాజీ వుల్లూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.//